![]() |
![]() |

బాలకృష్ణని ప్రభాస్ 'డార్లింగ్' అని పిలిచారు. అలా కావాలని పిలిపించుకున్నారు బాలయ్య బాబు. ప్రభాస్ 'అన్ స్టాపబుల్' షోకి వచ్చిన ప్రోమో చూస్తేనే అర్ధమవుతోంది ఈ ఫుల్ ఎపిసోడ్ ఎలా ఉంటుంది అనేది. ఇక ఇద్దరి ఫాన్స్ కూడా ఈ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ చేసిన ప్రోమోకి సోషల్ మీడియా షేకైపోయింది.
"కాశ్యపస్య గోత్రోభవస్య ఉప్పలపాటి ప్రభాస్ రాజు నామధేయస్య.. బహుపరాక్" అంటూ ఒక రేంజ్ లో బాహుబలి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో స్వాగతం పలికిన బాలయ్య బాబు వాయిస్ వింటే నిజంగా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. సభాముఖంగా అడుగుతున్నా "నన్ను కూడా డార్లింగ్ అని పిలవాలి అని రిక్వెస్ట్ చేసేసరికి ప్రభాస్ సరే డార్లింగ్ సార్ అని అన్నారు. "మొన్నామధ్య శర్వానంద్ వచ్చాడు. పెళ్ళెప్పుడు అంటే ప్రభాస్ పెళ్లి తర్వాత అన్నాడు" అని బాలకృష్ణ అనగా.. "నేను సల్మాన్ తర్వాత అనాలేమో" అంటూ పంచ్ డైలాగ్ వేసాడు. "నీ లైఫ్ లో మోస్ట్ రొమాంటిక్ సీన్ ఏది అని అడిగేసరికి డార్లింగ్ చాలా ఇబ్బంది పడ్డారు. "మీకు అప్పట్లో ఏ ఇబ్బందులూ లేవు కానీ ఇప్పుడు మాకు ఏది లేకపోయినా అనవసరమైన గోల ఎక్కువ" అని ప్రభాస్ అన్నారు.
తర్వాత బాలకృష్ణ.. చరణ్ కి కాల్ చేసి ప్రభాస్ ని ఆటపట్టించారు. "ఓ చరణూ.. రేయ్ నువ్వు నా ఫ్రెండువా ? శత్రువా?" అని ప్రభాస్ అన్నారు. షో ఇలా సాగుతుండగా గోపీచంద్ ఎంట్రీ ఇచ్చారు. "మనవాడు నా బెస్ట్ ఫ్రెండ్ అండి అని రామ్ చరణ్ కి ఫోన్ చేశాడు. చరణ్ చిన్న లీక్ న్యూస్ ఇచ్చాడు" అని బాలకృష్ణ అనగానే.. "రాణి గురించే కదా సార్" అని గోపీచంద్ అన్నారు. దీంతో ప్రభాస్ "ఒరేయ్ ఇరికించకురా" అన్నట్టు ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు. "ఫస్ట్ మూవీ నిన్ను మోసం చేసింది కదా ఏ ధైర్యంతో ఇంత దూరం వచ్చావ్" అని గోపీచంద్ ని అడిగేసరికి "ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది" అప్పుడు ప్రభాస్ పరిచయమయ్యాడు. "పడినప్పుడు లేచేవాడే అన్ స్టాపబుల్ అన్నారు బాలయ్యా"...ఇక ఈ ఫుల్ ఎపిసోడ్ డిసెంబర్ 30 న ప్రసారం కాబోతోంది.
![]() |
![]() |